ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మద్యపాన నిషేధం మరియు నాటు పారా నిర్మూలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించామని డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ సి . హరికుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా విసృతంగా దాడులు నేపధ్యంలో అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు 208 నాటు సారా కేసులు నమోదు చేసి, 518 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసామన్నారు. 9858 . 44 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని 2 , 49 , 217 లీటర్ల పులిసిని బెల్లపు ఆటను ద్వాంసం చేసి 63 వాహనములను స్వాధీనం చేసుకున్నామన్నారు. బెల్ట్ షాపులలో మద్యం విక్రయాలకు సంబంధించి 480 కేసులు నమోదు చేసి, 484 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 5996 . 115 లీటర్ల మద్యం , 1020 . 04 లీటర్ల బీరు ర మరియు 19 వాహనములను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇంకా పొరుగు రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించని మద్యంనకు సంబంధించి 124 కేసులు నమోదు చేసి 123 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 146 . 85 లీటర్ల మద్యం , 14 . 83 లీటర్ల బీరు మరియు 26 వాహనములను స్వాధీనం చేసుకోవడం జరిగిందని హరికుమార్ తెలియ చెయ్యడం జరిగింది.
నాటు సారా నిర్మూలనకై రాష్ట్రం లోని 13 జిల్లాలలో టాస్క్ ఫోర్స్ , ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఏక్సయిజ్ శాఖ అధికారుల ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని ఎస్పి లకు నాటు సారా రవాణా , విక్రయాలకు అవకాశం వున్న గ్రామాలను గురించిన సమాచారం అందచేయడమైనదన్నారు. రాబోయే వారంకు సంబంధించి మద్యపాన నిషేధం మరియు నాటు పారా నిర్మూలనలో భాగంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను అందరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్లకు ఇవ్వడం జరిగిందని తెలిపారు.