అమరావతి: ఇంగ్లిషు దినపత్రికల ప్రతినిధులతో సీఎం శ్రీ వైయస్.జగన్ క్యాంపు కార్యాలయంలో చిట్ చాట్ చేశారు. అందులోని అంశాలు.
పెన్షన్లపై సీఎం:
ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ... అన్యాయం జరిగిందనే భావన వారికి ఉంటుంది:
మేం సంతృప్తస్థాయిని ఎంచుకున్నాం:
ఓటు వేయని వారికి కూడా పెన్షన్లు ఇవ్వమని చెప్పాం:
ప్రజల ముందే లబ్ధిదారుల జాబితా పెడుతున్నాం:
సామాజిక తనిఖీకోసం గ్రామ ప్రజలముందే, గ్రామ సచివాలయంలో పెడుతున్నాం:
ఎవరుకూడా తప్పులు చేసే అవకాశం లేకుండా చేస్తున్నాం:
2వేల జనాభాకు ఒక సచివాలయం పెట్టాం:
అర్హులన్నవారికి ఎవ్వరికీ కూడా ఇవ్వకూడని పరిస్థితి ఉండకూడదని చెప్పాం:
ఇంకా ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోగా అర్హులకు కార్డులు ఇవ్వమని చెప్పాం:
వివక్ష, అవినీతి లేకుండా చూస్తున్నాం:
ప్రతి పథకంకూడా సంతృప్తస్థాయిలో, పారదర్శకంగా అమలు చేస్తున్నాం
పెన్షన్ ఇంతకుముందు కావాలంటే మూడు నెలల పెన్షన్ డబ్బు లంచంగా ఇవ్వాల్సి వచ్చేది
పథకాలపై :
మేం ఏంచెప్పామో అదే చేస్తున్నాం
మేం ప్రతి పథకాన్నీ పెడుతున్నామంటే.. మేం చెప్తున్నదాన్ని అమలుచేస్తున్నామని కదా?
ప్రతి ఏటా రెవిన్యూ ఎంతోకొంత పెరుగుతుంది
నంబర్లలో కాస్త అటూ ఇటూ ఉండొచ్చుకాని, పెరుగుదలైతే ఉంటుంది
ఇంగ్లిషు మీడియంపైన:
న్యూట్రల్ మనిషిని ఎవరైనా అడగండి...
కచ్చితంగా మా విధానాలను బలపరుస్తారు, మద్దతిస్తారు
ఇవాళ ఇంగ్లిషు మీడియం పెడితేనే... 20ఏళ్లలో మార్పులు వస్తాయి.
ఇవాళ ఫస్ట్‌క్లాస్ చదవే వ్యక్తి.. 20 ఏళ్ల తర్వాత డిగ్రీ పూర్తిచేస్తారు.
ఇవాళ ఫోన్‌ఆన్ చేస్తే..కమ్యూనికేషన్ అంతా ఇంగ్లిషే
కంప్యూటర్లు.. ఇంటర్నెట్‌అంతా ఇంగ్లిష్‌లోనే
డ్రైవర్‌లెస్‌కార్లు వస్తున్నాయన్నది రియాల్టీ
ఇవాళ మనం మార్పు చేసుకుంటేనే.. భవిష్యత్‌తరాలకు మంచి జరుగుతుంది
సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి
అన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యాకమిటీలు పూర్తిగా ఇంగ్లిషు మీడియం పెట్టాలని వారంతా తీర్మానాలు చేసి పంపారు
ఎవర్ని అడిగినా ఇంగ్లిషుమీడియం కావాలనే చెప్తారు
రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ...:
రాజధానిపై నేను చెప్పాల్సింది అంతా అసెంబ్లీలోనే చెప్పాను
రాజధానిని ఎంచుకున్న ప్రాంతాన్ని చూడండి
అటు విజయవాడా కాదు, ఇటు గుంటూరూ కాదు...
రాజధాని ప్రాంతం ఎక్కడ వస్తుందీ ముందే తనవారికి, తన అనుచరులకీ చెప్పి.. వేలాది ఎకరాలు కొనుగోలుచేయడం, క్యాబినెట్ సబ్‌కమిటీ ప్రాథమిక పరిశీలనలోనే 4వేలకుపైగా ఎకరాలు బటయపడ్డం.. అదంతా వేరే కథ.
మరికొన్ని కీలక అంశాలను చూస్తే.. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే ఇవ్వాళ్టికీ మనం సింగిల్ రోడ్డుమీదే వెళ్లాలి. కరకట్టమీదున్న సింగిల్ రోడ్డుమీదనుంచే పోవాలి.
నేనేమీ అబద్ధాలు చెప్పడంలేదు. మీడియా ప్రతినిధులుగా మీరుకూడా అదే దారివెంబడి వెళ్లాలి.
సమీకరించిన భూమిని డెవలప్ చేయడానికి, కరెంటు, రోడ్లు, పైపులైన్‌తో నీరు ఇవ్వడానికి ఎకరాకు కనీసం రూ.2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని గత ప్రభుత్వం వాళ్లే చెప్పారు. రూ. 1,09,000 కోట్ల అంచనా వేశారు.
కాని అదే ప్రభుత్వం ఐదేళ్లకాలంలో రూ.5600 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. మరో రూ.2–3 వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించమని మాకు అప్పగించి వెళ్లిపోయారు. ఇందులోనూ రూ.500 కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లించాల్సిన పరిస్థితి.
ప్రతి ఏటా రూ.6 నుంచి 7 వేల కోట్లరూపాయలు రాజధాని మీద పెడితే.. అది సముద్రంలో వేసిన నీటిబొట్టే అవుతుంది. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు ఉండదు.